Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:46 AM

ఎస్కేడీ నగర్‌లో సీసీ రోడ్ల పనులు త్వరలో ప్రారంభం

16-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్ బీ నగర్ బీ .యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్కేడీ నగర్ కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.29 లక్షలు మంజూరైనప్పటికీ గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని కాలనీవాసులు జీహెచ్ఎంసీ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన మొద్దు లచ్చి రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ విభాగం డీఈ కనకయ్య, ఏఈ విఘ్నేశ్వరి లతో కలిసి కాలనీలో రోడ్డు పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తేదారుల కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని కాలనీవాసులు తెలియజేయడంతో సంబంధిత అధికారులతో చర్చించామని, వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ సరైన లెవెల్స్‌తో పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు, కో కన్వీనర్ రఘురాం నేత, ట్రెజరర్ కృష్ణారావు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యదర్శి కాంతారావు, కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, కాలనీ సభ్యులు వీరారెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్కేడీ నగర్‌లో సీసీ రోడ్ల పనులు త్వరలో ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News