Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:52 AM

‘ఎస్ఐఆర్’తో ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి: బి.వి. రాఘవులు

20-07-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాబోయే 2029 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ను ప్రయోగిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ఆరోపించారు. సోమవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ​ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, గిరిజనులు, పేద వర్గాల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ‘ఎస్ఐఆర్’ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గతంలో బెంగాల్, బీహార్, అస్సాంలలో అమలు చేసిన ఈ కుట్రను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లాలో బీఎల్‌ఓలకు సరైన శిక్షణ ఇవ్వలేదని, కలెక్టర్ వెంటనే అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎం డి పాష అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య, కొండమడుగు నరసింహ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, బూరుగు కృష్ణారెడ్డి, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు రాయగిరి కిష్టయ్య, సిరిపంగి స్వామి, అవ్వారు రామేశ్వరి, బొడ్డుపల్లి వెంకటేష్, మద్దెల రాజయ్య, దూడ యాదిరెడ్డి, కోట రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

‘ఎస్ఐఆర్’తో ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి: బి.వి. రాఘవులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News