Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:44 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

13-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఎస్‌ఐఆర్ పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలని తెలిపారు. సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదు కాకుండా జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు.

రాజకీయ పార్టీల ద్వారా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని, బూత్ లెవల్ అధికారులందరికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే మరణించిన ఓటర్ల వివరాలు, పెండింగ్‌లో ఉన్న ఫార్ములు, జనాభా వివరాలు, నకిలీ ఓట్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించి సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ కృష్ణా తదితర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News