Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు

14-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, ప్రభుత్వ బాలుర పాఠశాల, విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మెడికల్ సిబ్బంది తదితర అంశాలను కూడా పరిశీలించారు.

పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ఈ పరిశీలనలో పరీక్షా కేంద్రాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News