Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు! 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 07:13 PM

ఎస్‌బీఐ ఏసీబీ బ్రాంచ్‌లో రూ. 2.65 కోట్ల భారీ మోసం!

ఎస్‌బీఐ ఏసీబీ బ్రాంచ్‌లో రూ. 2.65 కోట్ల భారీ మోసం!

ఎస్‌బీఐ ఏసీబీ బ్రాంచ్‌లో రూ. 2.65 కోట్ల భారీ మోసం!
April 21, 2026 05:32 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బ్యాంక్ మేనేజర్, హౌస్‌కీపింగ్ ఉద్యోగి సహా నలుగురి అరెస్ట్..

రూ. 2.42 కోట్ల నగదు స్వాధీనం నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి..


నల్లగొండ : నమ్మకంగా పనిచేయాల్సిన చోటే కన్నం వేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని నిద్రాణంగా ఉన్న ఖాతాల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. దేవరకొండ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అగ్రికల్చరల్ కమర్షియల్ బ్రాంచ్ (ఏసీబీ) లో జరిగిన రూ. 2.65 కోట్ల భారీ ఆర్థిక మోసాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు సమర్థవంతంగా ఛేదించారు. ఈ కేసులో సూర్యాపేట ఎస్‌బీఐ మేనేజర్, దేవరకొండ శాఖ హౌస్‌కీపింగ్ ఉద్యోగి సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 2.42 కోట్ల భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం దేవరకొండ ఎస్‌బీఐ శాఖలో ఐదేళ్లుగా కాంట్రాక్ట్ హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణికి కంప్యూటర్లపై పట్టు ఉండటంతో సిబ్బందికి తెలియకుండా బ్యాంకు అంతర్గత వ్యవహారాలను గమనించేవాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతనికి సూర్యాపేట ఎస్‌బీఐ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించాలని పథకం వేశారు. మేనేజర్ రామాంజనేయులు తనకున్న అధికారంతో గత కొన్నేళ్లుగా లావాదేవీలు జరగని 10 నిద్రాణమైన ఖాతాలను గుర్తించాడు. ఆ ఖాతాదారుల వివరాలు సేకరించి నకిలీ ఆధార్, పాన్ కార్డులు సృష్టించారు. అనంతరం బ్యాంకులో రద్దీగా ఉన్న సమయంలో చక్రపాణి సిబ్బంది లాగిన్ ఐడీలను దొంగతనంగా ఉపయోగించి ఆ ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్లను అనుసంధానించాడు. యోనో యాప్ ద్వారా కొత్త పిన్ నంబర్లు సృష్టించి డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించారు. ఈ మోసంలో నిందితులకు సహకరించిన కేతవత్ రాంలాల్, మారేపల్లి శివలు తమకు తెలిసిన వ్యక్తులకు కమిషన్ ఆశ చూపించి వారి ఖాతాల వివరాలు సేకరించారు. ఆ ఖాతాల్లోకి మళ్లించిన సొమ్మును విత్ డ్రా చేసి వాటాలు పంచుకున్నారు. హైదరాబాద్ కోఠి బ్రాంచ్‌కు చెందిన ఒక ఖాతాదారునికి ఈ-మెయిల్ ద్వారా అలర్ట్ రావడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుత బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 1.10 కోట్ల నగదుతో పాటు, బెనిఫిషరీ ఖాతాల నుంచి మరో రూ. 1.31 కోట్లను రికవరీ చేశారు. వీటితో పాటు ఆరు ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ వెంకట రెడ్డి, ఎస్సై రాజు మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News