Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్‌ 100 పడకల ఆసుపత్రి.. క్రెడిట్‌ ఎవరిది? ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 12:33 PM

ఏప్రిల్ 1 నుంచి ‘ఈ-ఆఫీస్’ ద్వారానే ఫైళ్ల నిర్వహణ..కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం

30-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభల నిర్వహణ..

పదో తరగతి విద్యార్థులు చదువు ఆపొద్దు బాల్య వివాహాల నిరోధానికి చర్యలు..

​నల్గొండ : జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ప్రభుత్వ ఫైళ్ల నిర్వహణ అంతా ‘ఈ-ఆఫీస్’ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

ఈ-ఆఫీస్ నిర్వహణపై ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామని బుధవారం నుండి మాన్యువల్ ఫైళ్లకు స్వస్తి పలికి డిజిటల్ విధానంలోనే ఫైళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన జిల్లావ్యాప్తంగా ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామసభలు మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను ఈ సభల్లో చదివి వినిపించాలి. ప్రజలకు అర్థమయ్యేలా ఫొటోలు, వీడియోలతో ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు మినిట్స్‌ను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారంటీలు, ధరణి (తిరుమలగిరి సాగర్), భూభారతి (దేవరకొండ), సోలార్ రూఫ్ టాప్ (కనగల్) పథకాల లబ్ధిదారుల వివరాలను నియోజకవర్గాల వారీగా నివేదికలు రూపొందించి సిపిఓకు సమర్పించాలని ఆదేశించారు.

​ముఖ్యమైన పనుల దృష్ట్యా సెలవులు రద్దు..

రానున్న రెండున్నర నెలలు జిల్లా యంత్రాంగానికి అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. రబీ ధాన్యం కొనుగోలు, జనగణన, ప్రజా పాలన వంటి ముఖ్యమైన విధులు ఉన్నందున అత్యవసరమైతే తప్ప అధికారులకు, సిబ్బందికి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఎండాకాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

​చదువు మధ్యలో ఆపొద్దు..

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా ఉండకూడదని వారిని ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేర్పించేలా మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను చదువు మాన్పించి బాల్య వివాహాల వైపు మళ్లించకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 2025-26 రబీ ధాన్యం కొనుగోలుపై రూపొందించిన గోడపత్రికను అలాగే జిల్లా ముస్లిం ఉద్యోగుల టేబుల్ క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ సీనియర్ చెవిటి క్రీడల ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు అందాయి. ఇందులో రెవెన్యూ విభాగానికి సంబంధించి 69, ఇతర శాఖలకు 57 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏప్రిల్ 1 నుంచి ‘ఈ-ఆఫీస్’ ద్వారానే ఫైళ్ల నిర్వహణ..కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News