Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:47 AM

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

30-03-2026 221 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేయాలని మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండో విడతలో భాగంగా 254 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షలు జమ చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా నిధులు నిలిచిపోయాయని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత బంధు లబ్ధిదారులుగా నమోదు కావడంతో ఇతర సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు.

పేదరికంలో జీవిస్తున్న తమకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాలెంల నరేందర్, ఇటుకాల ఆంజనేయులు, జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, చెడిపల్లి రఘుపతి, అల్వాల శంకర్, బందెల శీను, ఇరుగు లక్ష్మణ్, నీలం నరేష్, ఎలిజాల అశోక్, బోనాల మహేందర్, చెరుకు మధు, సందీప్, కడియం నాగయ్య, బట్ట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News