Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

“కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం”

“కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం”

“కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం”
March 30, 2026 05:20 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఆహార కల్తీపై ప్రత్యేక వ్యవస్థ… సన్నబియ్యం పథకంపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈగల్, హైడ్రా తరహాలోనే కల్తీ నిరోధానికి ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసి మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా శాసనసభ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.39 కోట్ల మందికి ఈ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మండలి చైర్మన్గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, గతంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన దొడ్డుబియ్యం వినియోగంలో సమస్యలు ఉన్నాయని వివరించారు. పేదలు ఆ బియ్యాన్ని తినకపోవడంతో, దాన్ని సన్నబియ్యంగా మార్చే అక్రమ వ్యవస్థలు పెరిగిపోయాయని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి ఖర్చు పెరగడం తప్ప పేదలకు ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు.

ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని పేదలు సులభంగా వినియోగించగలిగే సన్నబియ్యాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రైతులను సన్నవడ్లు పండించేందుకు ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించామని వివరించారు. ఈ చర్యల వల్ల రైతులకు లాభం కలగడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందుతోందని అన్నారు.

అలాగే రాష్ట్రంలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డులు జారీ చేసినట్లు సీఎం తెలిపారు. పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకతను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించి, వాణిజ్య పంటల వైపు ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని వివరించారు.

ఇక ఆహార భద్రత, నాణ్యత పరిరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కల్తీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సన్నబియ్యం పథకం విజయవంతంగా కొనసాగుతుండటంతో పాటు, ఆహార కల్తీ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News