Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

చిన్న కొండూరు కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బక్క మల్లయ్య

29-03-2026 413 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలంలోని చిన్న కొండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు బక్క మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బక్క మల్లయ్య మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. ఒకసారి వార్డ్ సభ్యునిగా పార్టీ అవకాశం కల్పించిందని, మళ్లీ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.తన ఎన్నికకు సహకరించిన గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య, మాజీ సర్పంచులు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, పదవులు వచ్చేలా మండల శాఖకు ప్రతిపాదనలు చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చిన్న కొండూరు కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బక్క మల్లయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News