అంగన్‌వాడీ కేంద్రాలు, రహదారుల శుభ్రత.
భువనగిరి, నవంబర్ 27 స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామంలో భువనగిరిలోని ఎస్‌ఎంటీ అల్నర్మ్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా శుక్రవారం విద్యార్థినులు పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, రహదారులను శుభ్రం చేసి పరిసరాల పరిశుభ్రతకు తమ వంతు సహకారం అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి నాగేశ్వరి బాయి, విద్యార్థినులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి