పదో తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత.. నెలకు రూ.19,288 వేతనం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎస్‌కేఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ (ఆదివారం) చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ హైస్కూల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. చౌటుప్పల్ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు అర్హులని పేర్కొన్నారు.ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,288 వేతనంతో పాటు ఈఎస్ఐ హెల్త్ కార్డు, పీఎఫ్ సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. వీటికి అదనంగా రూ.2,000 వసతి (అకామిడేషన్) అలవెన్స్, రూ.1,500 అటెండెన్స్ బోనస్, కంపెనీలో ఉచిత భోజన వసతి ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల రాకపోకల కోసం చౌటుప్పల్ కూరగాయల మార్కెట్ నుంచి ఉచిత కంపెనీ బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పదో తరగతి మెమో, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ ప్రతులతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో నేరుగా హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 9182009732 (అశోక్), 6308276070 (మూర్తి) నంబర్లలో సంప్రదించాలని కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి