ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు అందించారని కొనియాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించిన మహనీయుడని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాలమాకుల కవిత నర్సింగ్, పాలమాకుల నవ్య నర్సింహా, చప్పిడి సంజీవ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ స్వరూప, చౌట గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి