యాదాద్రి భువనగిరి లో
గురువారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్ మిల్లరలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు మరియు మిల్లర్ల ద్వారా ధాన్యం అన్‌లోడ్ చేయడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మిల్లర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, బ్యాంక్ గ్యారెంటీ (బీజీ) మరియు అగ్రిమెంట్ ఇచ్చి ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని తెలిపినారు.
రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ధాన్యం కొనుగోలు సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు / మిల్లర్లకు సూచించారు.
రబీ 2024-25, ఖరీఫ్& రబీ 2025-26 సిఎంఆర్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా మేనేజర్ , మరియు మిల్లర్లు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి