Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి.

Updated : 26 Nov 2026 18:51 IST
As Preferred Source 1 min read
రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి.

రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.

రామన్నపేట నవంబర్ 26 స్థానికం ప్రతినిధి :

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలోని శ్రీ వేమవరం మనోహర పంతులు, జానకమ్మ గార్ల కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి అధ్యాపకులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా చరిత్ర అధ్యాపకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులతో పాటు పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తించుకోవాలని సూచించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విద్యార్థులు అలవర్చుకోవాలని తెలిపారు.

అనంతరం విద్యార్థులకు భారత రాజ్యాంగంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి