డిసెంబర్ 7న బోగారంలో మహా పడిపూజ, అగ్నిగుండాల కార్యక్రమం
రామన్నపేట: మండలంలోని బోగారం గ్రామంలో డిసెంబర్ 7న నిర్వహించనున్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ, అగ్నిగుండాల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
కార్యక్రమంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధాన పీఠాధిపతి కడారి మల్లేశం గురుస్వామి, తెలుసూరి మల్లేష్ గురుస్వామి, కార్యక్రమ నిర్వాహకుడు రాపోలు శ్రీకాంత్, పబ్బు ధనుంజయ, కూనూరు రామాంజనేయులు గురుస్వామి, గుర్రం ముత్తయ్య గురుస్వామి, కడారి పాపయ్య స్వామి, మేడి ఆంజనేయులు స్వామి, మేడి అశోక్ స్వామి, గుంతకండ్ల గణేష్ రెడ్డి స్వామి, కడారి గణేష్ స్వామి, కడారి సాయి శంకర్ స్వామి, బడుగు శివ స్వామి, గోగు సాయి స్వామి, గ్రామ పెద్దలు కూనూరు రాజు గౌడ్, నేరటి సురేష్, రాపోలు గణేష్, కూనూరు మహేష్ గౌడ్, జెల్లా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి