Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి: పగిళ్ల మోహన్ రెడ్డి

Updated : 26 Nov 2026 18:19 IST
As Preferred Source 1 min read
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి: పగిళ్ల మోహన్ రెడ్డి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డు వద్ద గల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కులను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం కోసం నిలబడతానని స్పష్టం చేశారు. ప్రజల హక్కులకు భంగం కలిగించే అన్యాయాలు, అక్రమాలు, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తుతామన్నారు.​కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రజల ఐక్యతను కాపాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూ, రాజ్యాంగ పరిరక్షణే తమ బాధ్యతగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడత రామలింగం, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శంకర్, నాయకులు బద్దుల సుధాకర్, రొండి నరసింహ, టంగుటూరి రాములు, దాసరి కృష్ణ, పి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి: పగిళ్ల మోహన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి