Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

భారత రాజ్యాంగం ఒక మహా అద్భుతం- ​చౌటుప్పల్ న్యాయమూర్తి గౌస్ పాషా

Updated : 27 Nov 2026 04:05 IST
As Preferred Source 1 min read
భారత రాజ్యాంగం ఒక మహా అద్భుతం- ​చౌటుప్పల్ న్యాయమూర్తి గౌస్ పాషా

​బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగం ఒక మహా అద్భుతమని, దాని పరిరక్షణ బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చౌటుప్పల్ కోర్టు న్యాయమూర్తి గౌస్ పాషా పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ​కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని జడ్జి కొనియాడారు. కుల, మత, ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందేలా రాజ్యాంగం మార్గదర్శనం చేస్తోందన్నారు. పౌరులంతా తమ హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకుని మెలగాలని సూచించారు.​న్యాయవాదుల పాత్ర కీలకం.. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని జడ్జి గౌస్ పాషా పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పిట్టల బిక్షమయ్య, సహాయ కార్యదర్శి మక్తాల నర్సింహ, కోశాధికారి అల్లి స్వాతి, కార్యవర్గ సభ్యులు కయుం పాషా, పిల్లలమర్రి కిరణ్, మాజీ అధ్యక్షులు ఎలమోని శీను, ఉడుగు శ్రీనివాస్, బాల్యం వెంకటాచలపతి, సీనియర్ న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, రాపోలు వేణు, గంగదేవి రవీందర్, పాల పరమేష్, చామట్ల జంగయ్య, కట్టెల లింగస్వామి, గర్దాస్ రాఘవేందర్, పిట్టల భరత్, చిలివేరు మల్లికార్జున్, ఇతగోని శ్రీకాంత్, సుంకరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భారత రాజ్యాంగం ఒక మహా అద్భుతం- ​చౌటుప్పల్ న్యాయమూర్తి గౌస్ పాషా

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి