Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి.

Updated : 26 Nov 2026 20:07 IST
As Preferred Source 1 min read
రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి.

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.

భువనగిరి, నవంబర్ 26: భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందుల మధు, ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం కల్పించిన గొప్ప గ్రంథం భారత రాజ్యాంగమని పేర్కొన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలం, మనుధర్మ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ పీఠికలోని లౌకికవాదం, సామ్యవాదం వంటి పదాలను తొలగించాలనే చర్చలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పార్లమెంట్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మతం, కులం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని, పౌరుల హక్కులను పరిరక్షించుకోవడమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చిన ఎస్ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మార్పాక లోకేష్, నాయకులు చందు, క్రాంతి, నితిన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి