చిట్యాల: పెద్దకాపర్తి గ్రామంలోని శ్రీ వెంకటరమణ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నికపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
డీసీసీ ఉపాధ్యక్షుడు కందిమల్ల శిశుపాల్ రెడ్డి సూచన మేరకు గ్రామ శాఖ అధ్యక్షుడిగా నీలకంఠం నరేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయానికి నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలందరూ ఏకాభిప్రాయం తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి