మోత్కూర్ మండల పరిధిలో
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి.
మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్
ఈ నెల 29వ తేదిన మోత్కూర్ మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల ప్రకారం నిర్వహించు ధీక్షాదీవాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్ అడ్డగూడూరులో శుక్రవారం రోజున నిర్వహించిన బిఆర్ఎస్ ముఖ్య కార్తకర్తల సమావేశంలో మండల ప్రజలను ఉద్దేశించి అన్నారు.2009 లో భారీ ఎత్తున కేసి ఆర్ తలపెట్టిన ధీక్షాదీవాస్ కార్యక్రమం నేటి యువత మనం చెప్పాల్సిన అవసరంఎంతయిన ఉందని వారు గుర్తుచేశారు. నేటి యువత నాడు 2009 వ సంవత్సరంలో 5 నుండి 9సంవత్సరాలు ఉన్న విధ్యార్థులకు ముఖ్యంగా మనం కేసి ఆర్ చేసిన సేవలను గుర్తుచేయాలపని వారు నేడు ఎదిగి పెద్దవారు అయినారని అందుకనే మనం బిఆర్ఎస్ నాయకులం వారికి చెప్పాలని ఈ విధంగా గుర్తుచేశారు. నాడు
నవాబుల కాలంలో
సంపన్న రాష్ట్రముగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర నాయకులు కావాలనే మనల్ని మోసం చేసి ఆంధ్ర రాష్ట్రంగా కలుపుకోని మన తెలంగాణ సంపదను మొత్తం ఆంధ్రకు తరలించి అక్కడ రోడ్లు భవనాలు, వంతెనలు, డ్యాంలను కట్టుకోని నాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని అలాంటి నాయకుల బంది అయిన తెలంగాణను నాడు పరిస్థితులను అర్థం చేసుకోనే కేసి ఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం 2009 నవంబర్ 29 వ తేదిన ధీక్షాదీవాస్ చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. అందుకే ఈనెల 29 న మోత్కూర్ లో జరిగే ధీక్షాదీవాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి దర్శనాల అంజయ్య, సర్పంచ్ లు పూజారి వనజసైదులు గౌడ్, మందుల రేణుకకిరణ్, దేశబోయిన నాగయ్య,మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్దన్ రెడ్డి, మండల,పట్టణప్రధాన కార్యదర్శులు Length చలపతి రెడ్డి,గజ్జెల్లి రవి, కో ఆప్షన్ మెంబర్ నాయకులు మాథాను ఆంథోని, కుకునూరు వెంకట్ రెడ్డి,జక్కుల రవి,బిఆరెస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు, వెంపర్ల నర్సిరెడ్డి, చిప్పలపల్లి నరేందర్,నాయకులు కన్నేబోయిన ఎలేంధర్,మెట్టు బాస్కర్ రెడ్డి,శీలం దావిద్,పోన్నాల నవీన్ కుమార్, గుగ్గిళ్ళ భరత్,నిర్మాల వెంకటేష్,వంగూరి పేతురు, సంతోష్ కుమార్,శ్రీరాముల రాములు,శ్రీకాంత్, పయ్యావుల మత్స్యగిరి,,రేకల ఇమ్మానేలు, బుడుగుండ్ల నర్సయ్య,బాస్కర్ రెడ్డి, తలపాక మహష్,తదితరులు నాయకులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి