Sthanikam - Truth Matters
Logo

బెల్ట్‌ షాపుల పక్కనే వలస కార్మికుడి మృతి.. ఏపూరులో మద్యం విక్రయాలు నిలిపివేయాలి

Updated : 27 Nov 2026 15:58 IST
As Preferred Source 1 min read
బెల్ట్‌ షాపుల పక్కనే వలస కార్మికుడి మృతి.. ఏపూరులో మద్యం విక్రయాలు నిలిపివేయాలి

ఏపూరు: గ్రామ పరిధిలోని బెల్ట్‌ షాపుల సమీపంలో బీహార్‌కు చెందిన వలస కార్మికుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో మద్యం విక్రయాలపై మరోసారి చర్చ మొదలైంది. మద్యం మహమ్మారికి గ్రామ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు సైతం బలవుతున్నారని కాంగ్రెస్‌ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలోనూ ఏపూరు గ్రామానికి చెందిన పలువురు మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలోని బెల్ట్‌ షాపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మద్యం కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే గ్రామంలో మరింత మంది మద్యానికి బానిసయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.బీహార్‌ కార్మికుడి మృతిని దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలు, కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకొచ్చి బెల్ట్‌ షాపుల రద్దుకు కృషి చేయాలని కోరారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

బెల్ట్‌ షాపుల పక్కనే వలస కార్మికుడి మృతి.. ఏపూరులో మద్యం విక్రయాలు నిలిపివేయాలి

Article Image

ఏపూరు: గ్రామ పరిధిలోని బెల్ట్‌ షాపుల సమీపంలో బీహార్‌కు చెందిన వలస కార్మికుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో మద్యం విక్రయాలపై మరోసారి చర్చ మొదలైంది. మద్యం మహమ్మారికి గ్రామ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు సైతం బలవుతున్నారని కాంగ్రెస్‌ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలోనూ ఏపూరు గ్రామానికి చెందిన పలువురు మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలోని బెల్ట్‌ షాపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మద్యం కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే గ్రామంలో మరింత మంది మద్యానికి బానిసయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.బీహార్‌ కార్మికుడి మృతిని దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలు, కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకొచ్చి బెల్ట్‌ షాపుల రద్దుకు కృషి చేయాలని కోరారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news