భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని ఓ పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెన్షన్ వేటు వేశారు. విద్యార్థినులతో దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపిన అధికారులు, నిబంధనల ప్రకారం ఆయనను తక్షణమే విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయన ప్రధాన కార్యాలయం దాటి వెళ్లరాదని స్పష్టం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి