Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

బస్వాపురంలో బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్: మచ్చ బిక్షపతి

Updated : 27 Nov 2026 16:38 IST
As Preferred Source 1 min read
బస్వాపురంలో బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్: మచ్చ బిక్షపతి

బోనగిరి మండల పరిధిలో బస్వాపురంలో బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామ సభ

బస్వాపురం గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా “బాల్య వివాహ రహిత భారత్” కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది.

ఈ గ్రామ సభ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బాలికల విద్య, ఆరోగ్యం, హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా, వాటిని అరికట్టేందుకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి, బాల్య వివాహ రహిత గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ గ్రామ సభలో తెలియజేశారు.

ఈ కార్యక్రమం ద్వారా బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది.

Sthanikam

బస్వాపురంలో బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్: మచ్చ బిక్షపతి

Article Image

బోనగిరి మండల పరిధిలో బస్వాపురంలో బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామ సభ

బస్వాపురం గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా “బాల్య వివాహ రహిత భారత్” కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది.

ఈ గ్రామ సభ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బాలికల విద్య, ఆరోగ్యం, హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా, వాటిని అరికట్టేందుకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి, బాల్య వివాహ రహిత గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ గ్రామ సభలో తెలియజేశారు.

ఈ కార్యక్రమం ద్వారా బాల్య వివాహాల నిర్మూలనపై గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి