చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
గత పదిహేనేళ్లుగా అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆశ్రమం ఉపాధ్యక్షుడు సారిపల్లి గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. డి.వి. సత్యనారాయణ (77) అనే వృద్ధుడిని సుమారు 15 సంవత్సరాల క్రితం ధర్మోజిగూడెం గ్రామస్థులు గుర్తించి, సంరక్షణ నిమిత్తం ఆశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఆశ్రమంలోనే ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతుండటంతో, మెరుగైన వైద్యం కోసం ఈ నెల 23న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆశ్రమానికి చేరుకున్న ఆయన, శుక్రవారం ఉదయం 9.40 గంటల సమయంలో మృతి చెందారు. ఆశ్రమ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి