Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / జహీరాబాద్

విద్యార్థినుల భవిష్యత్తుకు బాటలు వేసే వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

Updated : 27 Nov 2026 18:55 IST
As Preferred Source 1 min read
విద్యార్థినుల భవిష్యత్తుకు బాటలు వేసే వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంతో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించేందుకు న్యాకల్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాలలో వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు న్యూ ఏజ్ ఫౌండేషన్‌, కేఎల్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వేదికపై మాట్లాడే భయాన్ని అధిగమించడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలు, మానవతా విలువలపై శిక్షణ ఇచ్చారు. ప్రతి విద్యార్థిని తనలోని ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని శిక్షకులు సూచించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయాల స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి కె.లలిత, అధ్యాపకులు, విద్యార్థినులు, న్యూ ఏజ్ ఫౌండేషన్ డైరెక్టర్‌ బి.నవీన్‌కుమార్‌, కౌన్సిలర్‌ సంపత్‌ బోయిని, సీనియర్‌ శిక్షకులు బోయిని శ్రవణ్‌ పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థినుల భవిష్యత్తుకు బాటలు వేసే వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి