సదాశివపేట మండలంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలను శుక్రవారం అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆర్. పాండు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, విద్యార్థులకు భోజనం వడ్డించే విధానం, ఆహార నాణ్యతను పరిశీలించారు.విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, వారికి ప్రతిరోజూ అందిస్తున్న ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి గ్రామాలు, మండలాలు, తల్లిదండ్రుల వృత్తి వివరాలను తెలుసుకున్నారు. చదువు ఎలా సాగుతోంది? పాఠాలు అర్థమవుతున్నాయా? పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మంచి అధికారులుగా ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు భోజనం చేసే ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశించారు. అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి, నిల్వ ఉన్న సరుకుల గడువు తేదీలు, రికార్డులను తనిఖీ చేశారు.రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అంజలీదేవి, డీఎల్పీఓ అనిత, మండల విద్యాధికారి ఎన్. శంకర్, పాఠశాల ప్రిన్సిపాల్ మోసిన్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న అదనపు కలెక్టర్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి