Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

17-03-2026 528 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. మంగళవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 60.685 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి ఆదేశాల మేరకు రామన్నపేట, మోత్కూర్ స్టేషన్ల అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది.

అరెస్టైన నిందితులు మహారాష్ట్రకు చెందిన గంగా బాయ్ పాండు రంగ్ చౌహన్, కమల్ అర్జున్ మోహితే, విజయ్ ఆసారం గోరపడే మరియు నల్గొండకు చెందిన వల్లపు దాసు వేణుకుమార్‌గా గుర్తించారు. వీరు భరంపూర్ నుంచి గంజాయిని తరలించి, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర కు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. గంజాయి తో పాటు ఒక ఆటో, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని, నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కలిసి పాల్గొని సమన్వయంతో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News