Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు

30-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా, భక్తుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఏప్రిల్ 1 నుండి 6 వరకు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, తగిన స్థాయిలో భద్రతా ఏర్పాట్లు లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త కుమ్మరి రాజు హెచ్చరించారు.అడవి ప్రాంతం కావడం, కఠినమైన ట్రెక్కింగ్ మార్గం ఉండటం, అలాగే సన్నని దారులు కారణంగా భక్తులు ఒకేసారి పెద్ద సంఖ్యలో చేరుతుండటంతో తోపులాటలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.గతంలో జరిగిన కొన్ని దుర్ఘటనలను గుర్తుచేస్తూ, ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా, జాతర సమయంలో కొంతమంది వ్యాపారులు భక్తులను అధిక ధరలకు వస్తువులు అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని, ముఖ్యంగా తాగునీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయించడం ఆపాలని కోరారు.

ఈ నేపథ్యంలో, కుమ్మరి రాజు తెలంగాణ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయాన్ని సందర్శించి, ఎం.ఎస్.ఎస్ కార్యదర్శి సోమరాజుకు వినతి పత్రం అందజేశారు.దీనిపై స్పందించిన అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Sthanikam

భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News