Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:33 PM

కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి

28-03-2026 615 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంది మండలం పరిధిలోని జుల్కల్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూ టీమ్స్ సహాయంతో పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు.మృతురాలు మమతగా గుర్తించగా, ఆమె భర్త పట్నం ప్రవీణ్ గత జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ రోజు మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఇంటి దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.అయితే అసలు మరణ కారణాలపై స్పష్టత కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సమస్యలను ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో పంచుకోవాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని అవసరమైతే సహాయం పొందడం చాలా ముఖ్యమని తెలిపారు.

Sthanikam

కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News