Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:22 AM

నల్లగొండలో TS-MESA 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

30-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం TS-MESA-2026 టేబుల్ క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా పారదర్శకత మరింత మెరుగుపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఇలాంటి సంస్థలు ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)వై. అశోక్ రెడ్డి, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, డీఆర్‌డీఓ వై. శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

TS-MESA జిల్లా గౌరవ అధ్యక్షులు డా. ఏ.ఏ. ఖాన్, జిల్లా అధ్యక్షులు మహ్మద్ మోయిజ్, జనరల్ సెక్రటరీ మహ్మద్ మహమూద్, ప్రొఫెసర్ సయ్యద్ అలీ, అసోసియేట్ ప్రెసిడెంట్ సయ్యద్ అన్వరుద్దీన్, అదనపు జనరల్ సెక్రటరీ ఎం.డి. అతీక్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్లు ఎస్.కె. అఫ్జల్ బాబా, అబ్దుల్ హఫీజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అదేవిధంగా ఎం.ఏ. గఫార్, ఎం.డి. నజీర్ అలీ, ఎం.డి. అన్వర్ పాషా, ఎం.డి. ఖాసీం, ఎం.డి. బషీర్, ఎస్.కె. హనీఫ్, ఎం.డి. శాకీర్ అలీ, పర్వీన్ సుల్తానా తదితర సభ్యులు కూడా హాజరయ్యారు. కార్యక్రమం సందర్బంగా TS-MESA నాయకులు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. ఏ.ఏ. ఖాన్, మహ్మద్ మోయిజ్, మహ్మద్ మహమూద్ మాట్లాడుతూ TS-MESA నూతన సంవత్సర క్యాలెండర్ విడుదలకు సహకరించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవో మరియు ఇతర జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యలను అధికారులు సానుకూలంగా పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తంగా, ఈ కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో సాగి, TS-MESA సంస్థ మరియు జిల్లా పరిపాలన మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసినట్లు పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

Sthanikam

నల్లగొండలో TS-MESA 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News