Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

చిన్న కొండూరులో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం

27-03-2026 494 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీరాముడి ఆదర్శ జీవితం మానవాళికి దిక్సూచి – దేవాలయ అధ్యక్షుడు రాందాస్ గౌడ్

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరాముడి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు ఎరుకుల రాందాస్ గౌడ్ మాట్లాడుతూ, శ్రీరాముడి జీవితం మానవాళికి నిత్యనూతన సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.మర్యాదకు నిలువెత్తు రూపం, సత్యానికి చిరునామా, త్యాగానికి ప్రతిరూపం, ధైర్యానికి మారుపేరు శ్రీరాముడని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే ధర్మ మార్గంలో నడవడమేనని పేర్కొన్నారు.ఈ పవిత్ర సందర్భంగా భక్తులు శ్రీరాముడిని కేవలం పూజించడమే కాకుండా ఆయనలోని సహనం, ధైర్యం, ధర్మం, నిబద్ధత వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని సూచించారు. మన ఆలోచనల్లో రాముడు, మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం ఉండేలా సంకల్పం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కళ్యాణోత్సవంలో భాగంగా రాందాస్ గౌడ్, సంధ్య దంపతులు శ్రీరామచంద్రునికి, సీతాదేవికి పుస్తెమెట్టలు సమర్పించి, పాదప్రక్షాళన చేసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీరాముని ప్రార్థించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలను శాలువాలు కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చిన్న కొండూరులో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News