Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు

30-03-2026 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భాగ్యలక్ష్మి కుటుంబానికి అండగా నిలిచిన 10వ తరగతి స్నేహితులు

పులిపాటి భాగ్యలక్ష్మి అకాల మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోవడం పట్ల ఆమెతో కలిసి 10వ తరగతి చదివిన స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె వైద్య ఖర్చులకు తోడ్పాటుగా స్నేహితులు కలిసి రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. స్నేహబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ చర్య ద్వారా స్పష్టమైంది.ఆమె మరణానంతరం కూడా అదే స్నేహాన్ని నిలబెట్టుకుంటూ, అంత్యక్రియల ఖర్చులను పూర్తిగా భరించడం ద్వారా మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె నివాసంలో నిర్వహించిన అంత్యక్రియల్లో స్నేహితులు పాల్గొని, ఆమెకు చివరి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ ఉడుగు బాలకృష్ణ గౌడ్, జోర్కా నాగరాజు, యు వెంకటేష్ గౌడ్, ఎం పండు, ఐలమ్మ, రాంబాబు, ఆలం, డి రాజు, బి రమేష్, హైమావతి, ఎం శ్రీను, చి నాగరాజు, సబిత, అలివేలు, వనిత తదితరులు పాల్గొన్నారు. స్నేహం అంటే కేవలం మాటల్లో కాదు… అవసరమైన సమయంలో చేయూతగా నిలబడటమేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Sthanikam

స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News