Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

చైర్‌పర్సన్ ఆదేశాలతో యాక్షన్ వలిగొండ రోడ్డుకు కొత్త రూపు

30-03-2026 1,024 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా వలిగొండ రోడ్డును త్వరితగతిన అభివృద్ధి చేస్తామని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ తెలిపారు. గుంతలతో దెబ్బతిన్న రహదారి కారణంగా వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టినట్లు వెల్లడించారు.చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు, కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి ఆధ్వర్యంలో నేడు రోడ్డు ప్యాచ్ వర్క్ చేపట్టి, రాకపోకలకు అనువుగా మారుస్తున్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ…మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్లతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి శాశ్వత రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.చిన్న చిన్న అడ్డంకులను అధిగమిస్తూ పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

నగర ప్రజల సౌలభ్యం కోసం మున్సిపల్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

Sthanikam

చైర్‌పర్సన్ ఆదేశాలతో యాక్షన్ వలిగొండ రోడ్డుకు కొత్త రూపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News