Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:47 AM

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ

30-03-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ… జిల్లా ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

భువనగిరి జిల్లాలో రామన్నపేట, ఆలేరు మండలాల్లో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల మండలాలైన బీబీనగర్, వలిగొండ, ఆత్మకూరు, మోటకొండూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 5 వేల మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

భువనగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ధరావత్ జగన్ నాయక్, పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News