నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండలం పరిధిలోని అక్లీయి తండా గ్రామపంచాయతీకి చెందిన జాదవ్ వసరం నాయక్ వారి కుటుంబానికి మంగళవారం అనుకోని నష్టం కలిగింది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా వర్షం పడుతూ మెరుపులు, గర్జనలు కొనసాగుతున్న సమయంలో పిడుగు పడడంతో వారి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వ్యవసాయ పనులలో కీలక పాత్ర పోషించే ఎద్దు కోల్పోవడం వల్ల వారికి ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బ తగిలింది. గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.అధికారులు ఘటనను నమోదు చేసి బాధిత కుటుంబానికి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
PRINT TIME: August 31, 2026 12:36 PM
పిడుగు బారిన ఎద్దు మృతి… రైతు కుటుంబానికి భారీ నష్టం

24-03-2026
1,195 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండలం పరిధిలోని అక్లీయి తండా గ్రామపంచాయతీకి చెందిన జాదవ్ వసరం నాయక్ వారి కుటుంబానికి మంగళవారం అనుకోని నష్టం కలిగింది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా వర్షం పడుతూ మెరుపులు, గర్జనలు కొనసాగుతున్న సమయంలో పిడుగు పడడంతో వారి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వ్యవసాయ పనులలో కీలక పాత్ర పోషించే ఎద్దు కోల్పోవడం వల్ల వారికి ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బ తగిలింది. గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.అధికారులు ఘటనను నమోదు చేసి బాధిత కుటుంబానికి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి