Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు
30-03-2026 173 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చెల్లింపులేని కంపెనీ జప్తు – కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో పన్ను బకాయిలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. డిస్కవరీ లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై భారీ ఆస్తి పన్ను బకాయిల కారణంగా ఈరోజు జప్తు చర్యలు చేపట్టారు.2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పన్నులు చెల్లించకపోవడంతో, మొత్తం రూ 6,42,740 బకాయి పేరుకుపోయిందని అధికారులు వెల్లడించారు. గతంలో పలుమార్లు రెడ్ నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించిన మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఈ జప్తు ప్రక్రియను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…పట్టణ అభివృద్ధికి ఆస్తి పన్నులు ప్రధాన ఆదాయ వనరులని, పన్నులు చెల్లించని పక్షంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వార్డు ఆఫీసర్ సలీం, బిల్ కలెక్టర్ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News