Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:49 AM

ఆషా వర్కర్ల అరెస్టులకు నిరసన… ఖమ్మంలో సిఐటియు ఆందోళన

30-03-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లో ఆషా వర్కర్లపై జరిగిన అరెస్టులను ఖండిస్తూ ఖమ్మంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శనివారం రాష్ట్ర రాజధానిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆషా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోమవారం ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్డులో భారీగా ఆందోళన నిర్వహించారు.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌కు చేరుకున్న వేలాది ఆషా వర్కర్లతో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బల్గూరి మదు, రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమాళ్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఆషా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద భీమా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యల వల్లే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని గుర్తుచేశారు.

ఆషా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆషా వర్కర్లు బి. జ్యోతి, సుభద్ర, ఉమా, నాగమణి, శరభమ్మ, లీలావతి, సుజాత, లలిత, మమత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆషా వర్కర్ల అరెస్టులకు నిరసన… ఖమ్మంలో సిఐటియు ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News