Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌వీ నేతల నిర్బంధం

చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌వీ నేతల నిర్బంధం

చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌వీ నేతల నిర్బంధం
24-03-2026 331 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముట్టడి ముందు చౌటుప్పల్‌లో నేతల ముందస్తు అరెస్టులు

ఫిజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్‌వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ముందస్తు చర్యగా అరెస్టులు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టి, వాటి అమలుపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌వీ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ నిరంకుశ పాలన కొనసాగుతోందని వారు విమర్శించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలలో జాప్యం వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఒంటెద్దు లింగస్వామి, చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మలిగే బాలకృష్ణ, మండల నాయకుడు గంగదేవి శివ, మున్సిపాలిటీ నాయకుడు ఊదరి రాకేష్, ఎం.డి. అత్తు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌వీ నేతల నిర్బంధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News