Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

డిజిటల్ విధానంలో జనగణన-2027: ఇండ్ల గణనకు సిద్ధం కావాలి. భారతి హోళీకేరి

30-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇండ్ల గణన ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కలిగి ఉండి, డిజిటల్ విధానంలో గణన చేపట్టాలని సూచించారు. దేశంలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు పూర్తిగా నమోదు చేయాలని పేర్కొన్నారు.

ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకాన్ని మండలాల వారీగా పూర్తి చేసి, ప్రతి 300 ఇళ్లకు లేదా 750-800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించాలని సూచించారు. యాప్ నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించి గణన ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇండ్ల గణన ప్రక్రియను అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయమ్మ, జిల్లా జనగణన అధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డిజిటల్ విధానంలో జనగణన-2027: ఇండ్ల గణనకు సిద్ధం కావాలి. భారతి హోళీకేరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News