Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 09:37 AM

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం
January 18, 2026 07:24 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్

చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నేత, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్ సౌకర్యం, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, సాగు–తాగునీటి ప్రాజెక్టులు వంటి అనితరసాధ్యమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.ఎన్టీఆర్ ప్రజాజీవితంలో చేసిన సేవలు, రాజకీయాల్లో తీసుకువచ్చిన సంస్కరణలను ఈ సందర్భంగా అభిమానులు స్మరించుకున్నారు. రాజకీయాలను సేవగా మలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్‌ను టీడీపీ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సీమ లింగయ్య, సీనియర్ నాయకులు బొడిగె విజయ్ కుమార్ గౌడ్, మిద్దెల యాదగిరి, మాజీ సింగిల్ విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్ గౌడ్, రత్నం నర్సింహ, జవాజి మత్స్యగిరి, మిద్దెల రామలింగయ్య, అంబాల మారయ్య, బొడిగె యాదయ్య, గోపగోని భాషా, బడే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News