Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత

17-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధితో పాటు అభివృద్ధికి కూడా ఊతం లభిస్తోందని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే 61 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 73 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 220 గోకులం షెడ్లు, 139 నీటి తొట్టీలు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పేదలకు 100 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతోందన్నారు.

పనుల అమలులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేబర్ శాతం పెంచి మరిన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, పంట కాలువల శుభ్రత, నీటి సంరక్షణ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News