Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:58 AM

ఎన్‌జీ కళాశాల చరిత్రలో తొలిసారి ప్రొఫెసర్ పదోన్నతులు.

ఎన్‌జీ కళాశాల చరిత్రలో తొలిసారి ప్రొఫెసర్ పదోన్నతులు.

ఎన్‌జీ కళాశాల చరిత్రలో తొలిసారి ప్రొఫెసర్ పదోన్నతులు.
March 11, 2026 05:56 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డా. సముద్రాల ఉపేందర్, డా. అంతటి శ్రీనివాసులకు ప్రొఫెసర్ హోదా

నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. అంతటి శ్రీనివాసులులకు ప్రొఫెసర్ పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా కళాశాల స్టాఫ్ క్లబ్ తరపున వారిద్దరినీ ఘనంగా సన్మానించారు. ఉన్నత విద్యాశాఖ నిబంధనల ప్రకారం వారి సుదీర్ఘ అనుభవం, విద్యారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ పదోన్నతులను కల్పించినట్లు తెలిపారు.

డెబ్బై ఏళ్ల నాగార్జున ప్రభుత్వ కళాశాల చరిత్రలో ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. విద్యార్థుల అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాల్లో వీరిరువురు గత కొన్నేళ్లుగా విశేష కృషి చేస్తున్నారని సహచర అధ్యాపకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పి. రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అకాడమిక్ సమన్వయకర్త బత్తిని నాగరాజు, తెలుగు విభాగాధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, భౌతిక శాస్త్ర విభాగాధ్యక్షుడు డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఆంగ్ల విభాగాధ్యక్షుడు డా. వై.వి.ఆర్. ప్రసన్న కుమార్, చరిత్ర విభాగాధ్యక్షుడు డా. బట్టు కిరీటం, వాణిజ్య శాస్త్ర విభాగాధ్యక్షుడు డా. నాగరాజుతో పాటు అధ్యాపకులు డా. అనిల్ అబ్రహం, డా. బొజ్జ అనిల్ కుమార్, డా. బి. వెంకటేశ్వర్లు, డా. జ్యోత్స్న, డా. జి. భాగ్యలక్ష్మి, ఎన్. కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News