Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు
17-04-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద కోడిపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయ నరసింహులు తన పొలానికి వెళ్లిన సమయంలో మొక్కజొన్న తోటలో దాక్కున్న ఎలుగుబంటి అకస్మాత్తుగా బయటకు వచ్చి అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో నరసింహులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

దాడి అనంతరం అరుపులు వినిపించడంతో సమీపంలోని రైతులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని తరిమికొట్టి గాయపడిన నరసింహులను రక్షించారు. అనంతరం అతనిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అడవి ప్రాంతాలకు సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టినట్లు తెలిసింది.

Sthanikam

ఎలుగుబంటి దాడి… రైతుకు తీవ్ర గాయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News