ఎల్‌ఐసీ ఏజెంట్ల భవనానికి స్థల కేటాయింపునకు కృషి- టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్
ఎల్‌ఐసీ ఏజెంట్ల భవనానికి స్థల కేటాయింపునకు కృషి- టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్
K.RAVI
ఘనంగా LIAFI–1964 సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్ మహాసభలు
దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అయిన భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అభివృద్ధిలో ఏజెంట్ల పాత్ర అమూల్యమైనదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఎల్‌ఐసీ సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్‌కు సొంత భవన నిర్మాణం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (LIAFI–1964) సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని సీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... ప్రైవేట్ బీమా సంస్థలు ఎన్ని వచ్చినప్పటికీ ప్రజల్లో ఎల్‌ఐసీపై ఉన్న విశ్వాసం చెక్కుచెదరలేదన్నారు. జాతీయ నాయకుడు కౌటికె విఠల్ ఆహ్వానం మేరకే తాను ఈ సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎస్.బి. శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సికింద్రాబాద్ డివిజన్ యూనియన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడి ఏజెంట్ల ఐక్యత దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. అనంతరం జాతీయ నాయకుడు కౌటికె విఠల్ మాట్లాడుతూ.. ఏజెంట్లకు నిరంతర శిక్షణ, వృత్తిపరమైన విద్యతో పాటు చట్టపరమైన రక్షణ అవసరమన్నారు. ఏజెంట్ల కమిషన్‌ను పరిరక్షించుకునేందుకు LIAFI మరింత బలంగా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నిజామాబాద్, మెదక్, సికింద్రాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన 23 బ్రాంచ్‌లు, 14 శాటిలైట్ బ్రాంచ్‌ల నుంచి సుమారు 1,200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మూడేళ్లకోసారి నిర్వహించే ఈ మహాసభల్లో సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడు రామస్వామి (సిద్దిపేట బ్రాంచ్) ప్రధాన కార్యదర్శి గోవింద్ రెడ్డి (మిర్యాలగూడ బ్రాంచ్)
కోశాధికారి భాస్కర్ (కామారెడ్డి బ్రాంచ్)
నూతనంగా ఎన్నికైన నిర్వాహకులతో సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో LIAFI అఖిల భారత కోశాధికారి శ్రీరామ్, ఎల్‌ఐసీ సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహూ, మార్కెటింగ్ మేనేజర్ ఎం. ప్రసాద్ రావు, సీఎల్‌ఐఏ విభాగం సహాయ డిప్యూటీ మేనేజర్ ప్రభాకర్, వరంగల్ డివిజనల్ కౌన్సిల్ అధ్యక్షుడు పులి సుధాకర్, కరీంనగర్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు, నాయకులు ఇంద్రా రెడ్డి, కట్టా వెంకటరెడ్డి, రాజేష్, హేమలత, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి