Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:50 AM

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

07-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వంటగది, భోజనశాల, విద్యార్థులు పడుకునే పడకలను పరిశీలించారు. భోజనశాల శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిరోజూ శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వంట చేసే సమయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య గురించి వివరాలు తెలుసుకుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

అలాగే మంచినీటి ఆర్‌.ఓ. ప్లాంట్‌ను పరిశీలించి విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

రామన్నపేట: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వంటగది, భోజనశాల, విద్యార్థులు పడుకునే పడకలను పరిశీలించారు. భోజనశాల శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిరోజూ శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వంట చేసే సమయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య గురించి వివరాలు తెలుసుకుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

అలాగే మంచినీటి ఆర్‌.ఓ. ప్లాంట్‌ను పరిశీలించి విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News