Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:42 AM

విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం

విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం

విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం
11-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేలపట్లలో ఆర్యవైశ్య సంఘం సేవా కార్యక్రమం.

టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

కూసుమంచి: మండలంలోని నేలపట్ల గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఉపయోగపడే పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు.

అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఫ్యాన్లు, నేలపై కూర్చునేందుకు మ్యాట్లను అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ తెలిపారు.

చిన్నారులు, విద్యార్థుల అభివృద్ధి కోసం ఆర్యవైశ్య సంఘం తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందని సంఘ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాయల వీరస్వామి, మండల ఆర్యవైశ్య సంఘం పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు మరియు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో అందరూ కలిసి “జై వాసవి… జై జై వాసవి” అంటూ నినాదాలు చేశారు.

Sthanikam

విద్యార్థులకు అండగా ఆర్యవైశ్య సంఘం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News