Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:39 PM

విద్యార్థుల లాఠీచార్జీపై కోదాడ లో ప్రజా సంఘాల నిరసన

23-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కోటగిరి వెంకట్ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కోదాడ పట్టణంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దగ్గర జరిగిన లాఠీ చార్జి కి నిరసనగా సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీక్‌లకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, యువత గుమిగూడారని ఆయన పేర్కొన్నారు. శాంతియుత నిరసనకారులపై జరిగిన పోలీసు దాడులు ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పోలీసులు దారుణంగా వ్యవహరించడంతో పలువురు విద్యార్థులు, యువకులు గాయపడ్డారని, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.పేపర్ లీక్‌లకు బాధ్యులను గుర్తించడంలో, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. దేశవ్యాప్తంగా నెల రోజులుగా కొనసాగుతున్న నిరసనల పట్ల ప్రభుత్వం మొండివైఖరి అవలంబించడం దురదృష్టకరమన్నారు.

ప్రజలలో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆగ్రహాన్ని అణచివేత చర్యలతో అరికట్టలేరని హెచ్చరిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, అరెస్టు చేసిన నిరసనకారులందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు సిపిఎం కోదాడ పట్టణ కార్యదర్శి, ఎం ముత్యాలు డివైఎఫ్ఐ నాయకులు జె సాయికుమార్, జంగపల్లి శ్రీనివాస్, గంట నాగరాజు,యూనియన్ అధ్యక్షులు శరభంద రెడ్డి, సత్తిరెడ్డి, తిరపయ్య, శ్రీను, వెంకన్న, సైదులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల లాఠీచార్జీపై కోదాడ లో ప్రజా సంఘాల నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News