Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:34 AM

ఏబీసీడబ్ల్యూవో ఇంట్లో కోట్లు అవినీతి నిరోధక శాఖ సోదాల్లో నోట్ల కట్టలు, ఆభరణాల గుట్టలు

04-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ సోదాలు కలకలం రేపాయి. నరసన్నపేట వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి గడ్డి బాల ముకుందరావు నివాసాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

మెస్ బిల్లుల మంజూరుకు లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఏడాది జనవరి 28న ఆయన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, లెక్కల్లో చూపని రూ.1,84,070 నగదు పట్టుబడింది.

దర్యాప్తును విస్తరించిన అధికారులు తాజాగా శ్రీకాకుళం పట్టణంలోని ఆయనకు చెందిన రెండు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్‌రిజస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని నాలుగు స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి వస్తువులు, కొంత నగదు, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

నరసన్నపేటతో పాటు సోంపేట విభాగానికి కూడా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బాల ముకుందరావు వసతిగృహాల మెస్ బిల్లులు మంజూరు చేయడానికి ప్రతి విద్యార్థికి రూ.15 చొప్పున వార్డెన్ల నుంచి లంచం వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Sthanikam

ఏబీసీడబ్ల్యూవో ఇంట్లో కోట్లు అవినీతి నిరోధక శాఖ సోదాల్లో నోట్ల కట్టలు, ఆభరణాల గుట్టలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News