Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్‌తో వివాహిత మృతి

దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్‌తో వివాహిత మృతి

దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్‌తో వివాహిత మృతి
02-06-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలలో విషాదం..

విద్యుదాఘాతానికి 28 ఏళ్ల పావని బలి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెం లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మన్నబోయిన పావని (28) అనే వివాహిత మృతిచెందింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పావని తన ఇంటి వద్ద దండంపై బట్టలు ఆరేస్తుండగా అనుకోకుండా విద్యుత్ ప్రవాహానికి గురైంది. తీవ్రంగా షాక్ తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

యువ వివాహిత అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.పావని మృతిపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

దండంపై బట్టలు ఆరేస్తూ.. కరెంట్ షాక్‌తో వివాహిత మృతి

Article Image

చిట్యాలలో విషాదం..

విద్యుదాఘాతానికి 28 ఏళ్ల పావని బలి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెం లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మన్నబోయిన పావని (28) అనే వివాహిత మృతిచెందింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పావని తన ఇంటి వద్ద దండంపై బట్టలు ఆరేస్తుండగా అనుకోకుండా విద్యుత్ ప్రవాహానికి గురైంది. తీవ్రంగా షాక్ తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

యువ వివాహిత అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.పావని మృతిపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News