దివ్యాంగులకు మెరుగైన వసతులు కల్పించాలి. జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు దివ్యాంగుల ఫోరం వినతి
దివ్యాంగులకు మెరుగైన వసతులు కల్పించాలి. జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు దివ్యాంగుల ఫోరం వినతి
Editor Desk
హైదరాబాద్, జూలై 20:
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లో దివ్యాంగ విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను సమర్థంగా అమలు చేయాలని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. జయలక్ష్మిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో దివ్యాంగులకు అందుబాటు వసతులు, ప్రత్యేక డిసేబుల్ సెల్ ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల హక్కుల చట్టం–2016పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అలాగే ఫీజుల్లో రాయితీలు కల్పించడంతో పాటు అన్ని విభాగాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల విడుదల చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో దివ్యాంగులకు తగిన అవకాశాలు కల్పించాలని, దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపై స్పందించిన రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. జయలక్ష్మి, సమస్యలను వైస్‌చాన్స్‌లర్ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దొరపల్లి దానమ్మ, రాష్ట్ర సభ్యులు ఆంజనేయులు కురుమ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి